మహేష్ హీరోయిన్ గా తిరిగి ఈమెనే ఫిక్స్ చేసారు?


మహేష్ హీరోయిన్ గా తిరిగి ఈమెనే ఫిక్స్ చేసారు?
మహేష్ హీరోయిన్ గా తిరిగి ఈమెనే ఫిక్స్ చేసారు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు ఇప్పుడు తన తర్వాతి సినిమా విషయంలో సన్నాహకాలు మొదలుపెట్టేశాడు. ఇప్పటికే పరశురామ్ దర్శకుడిగా కన్ఫర్మ్ అయిపోయాడు. ఈ సినిమా ఒక పూర్తి స్థాయి ప్రేమకథాచిత్రంగా తెలుస్తోంది. మహేష్ తన కెరీర్ లో లవర్ బాయ్ గా చేసినవి చాలా తక్కువ సినిమాలు. ఇప్పటికీ క్యూట్ లుక్స్ తో కనిపించే మహేష్ మరోసారి ప్రేమ కథలో నటిస్తుండడం నిజంగా ఫ్యాన్స్ కు ఆనందమే కదా.

ఇక ఈ సినిమా లాంచ్ మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే అలాంటిదేం ఉండబోదని ఇటీవలే న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో పేర్లు బయటకు రావాల్సి ఉంది.

గత కొంత కాలంగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రం ద్వారా కియారా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. మరోసారి మహేష్ సరసన ఆడిపాడుతుందని వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ వార్తలు వచ్చినప్పుడు తోసిపుచ్చారు కానీ మరోసారి ఈ రూమర్స్ వస్తుండడంతో ఈసారి నిజమే అనుకోవక తప్పట్లేదు. ఏదేమైనా మరికొన్ని రోజులు ఆగితే ఏ విషయం తెలిసిపోతుంది.