సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ కన్ఫామా ?


సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ కన్ఫామా ?
సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ కన్ఫామా ?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆది పురుష్‌`. ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. 3డీ ఫార్మాట్‌లో తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రం రామాయ‌ణ గాధ నేప‌థ్యంలో తెర‌పైకి రాబోతోంది. ఇందులో రావ‌ణుడి పాత్ర‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే చిత్ర బృందం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

పాన్ ఇండియా స్థాయికి మించి తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కీర్తి సురేష్ న‌టిస్తార‌ని కొంత మంది, లేదు కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో సీత‌గా న‌టించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయిని తెలుస్తోంది. ఇదే విష‌యం కియారాని ఓ అభిమాని ఇండైరెక్ట్‌గా అడిగితే కియారా తెలివిగా స‌మాధానం చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`మీరు త్వ‌ర‌లో చూస్తార‌ని` కియారా స‌మాధానం ఇవ్వ‌డంతో `ఆది పురుష్‌`లో సీత‌గా కియారా న‌టించ‌డం గ్యారెంటీ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. వ్చే ఏడాది సెట్స్ పైకి రానున్న ఈ చి్త‌రం 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ట‌.