స్టార్ హీరోలు భ‌య‌ప‌డుతుంటే నేను రెడీ అంటోంది!స్టార్ హీరోలు భ‌య‌ప‌డుతుంటే నేను రెడీ అంటోంది!
స్టార్ హీరోలు భ‌య‌ప‌డుతుంటే నేను రెడీ అంటోంది!

థియేట‌ర్ల రీఓపెన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసినా జ‌నం మాత్రం ఇప్పుడ‌ప్పుడే సినిమాల కోసం థియేట‌ర్ల‌ల‌కు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇదే భ‌యం నిర్మాత‌ల్ని వెంటాడుతోంది. దీంతో థియేట‌ర్లు రీ ఓపెన్ అవుతున్నా ఓటీటీల్లోనే త‌మ చిత్రాల‌ని రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ఇప్ప‌టికీ ఓటీటీల‌నే న‌మ్ముకుంటున్నారు.

స్టార్ హీరోలు కూడా త‌మ చిత్రాల‌ని రిలీజ్ చేసేందుకు భ‌య‌ప‌డుతుంటే ఓ హీరోయిన్ సినిమా మాత్రం రెడీ అంటూ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఎం.ఎస్ ధోనీ, ల‌స్ట్ స్టోరీస్ వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది కియారా అద్వానీ. సౌత్‌లోనూ భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ చిత్రాల‌తో పాగావేసిన కియారా న‌టించిన తాజా చిత్రం `ఇందూ కి జ‌వానీ`. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో డిసెంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు.

దీంతో యావ‌త్ భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ మూవీ ఎలా రాణిస్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుర‌చూస్తున్నారు. ఈ మూవీ ఈ విధానంలో స‌క్సెస్ సాధిస్తే మ‌రిన్ని చిత్రాల‌కు బాట‌వేసింది అవుతుంది. అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)