పిల్లలపై దుష్ప్రభావం చూపెడుతున్న బిగ్ బాస్ 2


Kids minds are affecting : stop BiggBoss telugu2

బిగ్ బాస్ 2 వల్ల ఎటువంటి ఉపయోగం లేదని పైగా పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తోందని పలువురు మండిపడుతున్నారు . బిగ్ బాస్ 2 హౌజ్ లో రకరకాల టాస్క్ ల పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ,పిల్లలతో కలిసి బిగ్ బాస్ ని చూడలేకపోతున్నామని అలాగే పిల్లలు ఈ షోని చూసి పక్కదారి పట్టేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇంటిల్లిపాది చూడాల్సిన బుల్లితెర పై అడల్ట్ షోని చూపిస్తూ తీవ్ర మనోక్షోభకు గురిచేస్తున్నారని వాపోతున్నారు . ఇలాంటి అసభ్యకరమైన షోని ఎలా టెలికాస్ట్ చేస్తున్నారని ,తమకిష్టమైన కంటెస్టెంట్ లకు ఓట్లు వేయాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని , ఏడుస్తూ మానసిక ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

బిగ్ బాస్ మొదటి సిరీస్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . ఇప్పటికే బిగ్ బాస్ 2షోని పలు వివాదాలు వెంటాడగా తాజాగా ఈ వీడియో కూడా మరింత వివాదాన్ని రాజేసేలా ఉంది .

English Title: Kids minds are affecting : stop BiggBoss telugu2