నన్ను చంపేయండి: ప‌్ర‌కాష్‌రాజ్‌!


నన్ను చంపేయండి: ప‌్ర‌కాష్‌రాజ్‌!
నన్ను చంపేయండి: ప‌్ర‌కాష్‌రాజ్‌!

విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌కాష్‌రాజ్‌కు మంచి పేరుంది. వెండితెర‌పై విల‌నిజాన్ని పండించి త‌న‌దైన పాత్ర‌ల్లో ఆక‌ట్టుకున్నారాయ‌న‌. జ‌ర్న‌లిస్టు మిత్రురాలు గౌరీ లంకేష్ దారుణ హ‌త్య త‌రువాత గ‌త కొంత కాలంగా ఆయ‌న `జస్ట్ ఆస్కింగ్‌` అనే హ్యాష్ ట్యాగ్‌తో బీజేపీ శ్రేణుల‌పై, వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన పౌర‌స‌త్వ బిల్లుపై ఈ మ‌ధ్య కాలంలో ఘాటుగానే స్పందిస్తూ త‌న వాణిని వినిపిస్తున్నారు.

అయితే ఆయ‌న‌ని గ‌త కొంత కాలంగా బీజేపీ, దాని అనుబంద శ్రేణులు టార్గెట్ చేయ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎవ‌రు ఎంత‌గా మెదిరింపుల‌కు దిగినా, చంపేస్తామ‌ని హెచ్చ‌రించినా ప్ర‌కాష్‌రాజ్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఎవ‌రు బెదిరించినా త‌ను ఇలాగే ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పేస్తున్నారు. తాజాగా ఆయ‌న‌ని, ఆయ‌న‌తో పాటు మ‌రికొంత మందిని ఈ నెల 29న హ‌త్య చేస్తామంటూ కొంత మంది అగంత‌కులు ఓ లెట‌ర్‌ని బెంగ‌ళూరుకు చెందిన ఓ స్వామీజీ ఆశ్ర‌మానికి పంపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

దీనిపై ప్ర‌కాష్‌రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా స్పందించారు. గాంధీని,గౌరీ లంకేష్‌ని చంపిన హంత‌కులారా న‌న్ను తీసుకెళ్లండి, న‌న్ను తీసుకెళ్లండి…నా లాంటి వాళ్ల‌ని మ‌రి కొంత మందిని తీసుకెళ్లండి. అయితే నా దృష్టి నుంచి మాత్రం మీరు త‌ప్పించుకోలేరు. నా రాజ్యాంగం నుంచి మాత్రం త‌ప్పించుకోలేరు. నా దేశ ఆత్మ‌ని మాత్రం తీసుకెళ్ల‌లేరు` అని చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.