కిమ్ శర్మ అతడికి బ్రేకప్ చెప్పిందట


హాట్ భామ కిమ్ శర్మ హర్షవర్ధన్ రాణే తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హర్షవర్ధన్ రాణే కు బ్రేకప్ చెప్పిందట ! ఏడాదిన్నర కాలంగా కిమ్ శర్మ – హర్షవర్ధన్ రాణే లు సహజీవనం చేస్తున్నారు . అయితే ఇన్నాళ్లు వీళ్ళ సహజీవనం బాగానే సాగింది కానీ రోజులు ఎక్కువయిన కొద్దీ ప్రేమ తగ్గిపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయట దాంతో ఇద్దరూ గొడవపడి విడిపోయారట .

కెన్యా కు చెందిన అలీ పుంజా ని పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక విబేధాలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చి ఇండియాకు తిరిగి వచ్చింది కిమ్ శర్మ . అయితే ఇండియాకు వచ్చిన తర్వాత సింగిల్ గా ఉండటంతో హర్షవర్ధన్ రాణే ఓ సినిమాలో కలిసి నటించడంతో దగ్గరయ్యారు . దాంతో సహజీవనం చేస్తూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు కట్ చేస్తే ఇప్పుడు విడిపోయారని ముంబై మీడియా కోడై కూస్తోంది .