నాగార్జున `అర్జున్‌రెడ్డి` అవుతున్నారా?



 

king nagarjuna become a arjun reddy
king nagarjuna become a arjun reddy

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇందులో యంగ‌ర్ మేనేజ్‌మెంట్‌తో త‌ను ప్రేమించిన అమ్మాయితో పాటు త‌న చుట్టూ వున్న వాళ్ల‌ని దూరం చేసుకుని బాద‌ప‌డే ఓ భ‌గ్న ప్రేమికుడి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అబ్బుర‌ప‌రిచి త‌న‌లోని న‌టుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హా యాంగ‌ర్ మేనేజ్‌మెంట్‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తిగా నాగార్జున క‌నిపించ‌బోతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం  `వైల్డ్ డాగ్‌` చిత్రంలో న‌టిస్తున్న నాగార్జున ఇటీవ‌లే మ‌రో క్రేజీ చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. ఇటీవ‌లే నిర్మాత నారాయ‌ణ్ దాస్ నారంగ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో నాగార్జున చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ా క‌నిపించ‌నున్నార‌ట‌. యాంగ‌ర్ మేనేజ్‌మెంట్‌తో బాధ‌ప‌డే అధికారిగా నాగార్జున పాత్ర చాలా కొత్త‌గా వుంటుంద‌ని, ఆయ‌న బాడీ లాంగ్వేజ్ ని కూడా కొత్త‌గా వుండేలా ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రారంభిస్తార‌ని తెలిసింది.