రెడ్ రీమేక్ పై స్పందించిన కిషోర్ తిరుమల

Kishore Tirumala talks about red release
Kishore Tirumala talks about red release

రామ్ పోతినేనితో కిషోర్ తిరుమలకు మంచి ర్యాపొ కుదిరింది. నేను శైలజ వంటి సూపర్ హిట్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ కూడా పర్వాలేదనిపించేలా ఆడింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం రెడ్. తమిళ చిత్రం తడమ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రామ్ డబల్ రోల్ లో కనిపించనున్నాడు.

సంక్రాంతికి రెడ్ విడుదలను కన్ఫర్మ్ చేసారు. జనవరి 14న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల సినిమా గురించి స్పందించాడు.

తడమ్ చిత్రానికి ఇది రీమేక్ అయినా కానీ కథ ఒకటే తీసుకున్నామని, స్క్రీన్ ప్లే, టేకింగ్ పూర్తిగా వేరుగా ఉంటాయని, డైలాగ్స్ కూడా ఫ్రెష్ గా రాసుకున్నామని అంటున్నాడు కిషోర్ తిరుమల. కొత్త కథ కోసం ఎంత కష్టపడతామో, రెడ్ కు కూడా అలాగే కష్టపడ్డామని కిషోర్ తిరుమల చెప్పుకొచ్చాడు. రెడ్ లో రామ్ రఫ్ లుక్ పూర్తిగా రామ్ దే డెసిషన్ అని తెలిపాడు.