ప్రముఖ గాయకుని సోదరుడు అనుమానాస్పద మృతి


KJ Yesudas brother sudden death
ప్రముఖ గాయకుని సోదరుడు అనుమానాస్పద మృతి

తన అద్భుతమైన స్వరంతో ఎన్నో వేల పాటలు పాడిన సుప్రసిద్ధ గాయకులు శ్రీ కేజే జేసుదాసు గారి సోదరుడు కేజే జస్టిన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళలోని కొచ్చిలోని బ్యాక్‌ వాటర్స్‌ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన జస్టిన్‌ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. బుధవారం త్రికక్కర పోలీసులు బ్యాక్‌ వాటర్స్‌ నుంచి జస్టిస్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్‌ వల్లర్పాడమ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ సమీపంలో జస్టిన్‌ శవం తేలుతూ కనిపించింది.

పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మరణంతో జస్టిన్‌ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు, అంతేకాకుండా ఆయనకు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని, ప్రాధమికంగా భావిస్తున్నారు. జేసుదాసు గారి స్వయాన సొంత సోదరుడైన జస్టిన్‌ సంగీత కారుడు, నాటక రచయిత. ఆయన అకాల మరణం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.