సందీప్ కిషన్ తో కొబ్బరిమట్ట నిర్మాతKobbari Matta Producer Next with Sundeep Kishan
Kobbari Matta Producer Next with Sundeep Kishan

హృదయ కాలేయం , కొబ్బరిమట్ట చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ హీరో సందీప్ కిషన్ తో సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి హృదయ కాలేయం అనే చిత్రాన్ని రూపొందించాడు సాయి రాజేష్. హృదయ కాలేయం చిత్రానికి మొదటి నుండి అండగా నిలిచింది ఈ సందీప్ కిషనే ! ఇక ఆ సినిమా విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

కాగా ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు కొబ్బరిమట్ట అనే చిత్రాన్ని నిర్మించాడు సాయి రాజేష్ ఇక ఈ సినిమాకు కూడా సందీప్ కిషన్ అండగా నిలిచాడు దాంతో తన తదుపరి చిత్రాన్ని సందీప్ కిషన్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడు సాయి రాజేష్. కొబ్బరిమట్ట చిత్రం కూడా ఇటీవల విడుదలై మంచి వసూళ్లని సాధించిన విషయం తెలిసిందే.

కొబ్బరిమట్ట చిత్రంతో మంచి లాభాలు గడించిన సాయి రాజేష్ సందీప్ కిషన్ తో ఓ విభిన్న కథా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సందీప్ కిషన్ కూడా సాయి రాజేష్ తో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాడు. హృదయ కాలేయం , కొబ్బరిమట్ట చిత్రాలతో సంచలనం సృష్టించిన సాయి రాజేష్ సందీప్ కిషన్ తో ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో!