శృతి ని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట


kollywood actress shruthi fearing with rape attempt

తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే శృతి ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తామని కొంతమంది అదేపనిగా బెదిరిస్తున్నారట దాంతో ఆ బెదిరింపుల వల్ల బయట తిరగాలంటే భయంగా ఉందని అంటోంది శృతి . ఈ భామ కొద్దిరోజుల క్రితం అరెస్ట్ అయ్యింది , ఇంతకీ శృతి ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసా …….. బాగా డబ్బున్న వాళ్లని , సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లను టార్గెట్ చేసి ప్రేమ , పెళ్లి అంటూ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు గుంజిందన్న ఆరోపణలు ఉన్నాయి దాంతో బాధితులు కేసు పెట్టడంతో శృతి తో పాటుగా ఆమె తల్లిదండ్రులు , సోదరుడి ని కూడా అరెస్ట్ చేసారు .

ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది శృతి , అయితే బయటకు రాకముందే పోలీసు ఉన్నతాధికారి తనని లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది . ఇక ఇప్పుడేమో కొంతమంది నన్ను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని భయంగా ఉందని అంటోంది శృతి . ఈ భామ మాటలు ఎలా ఉన్నప్పటికీ ఈమె పై మాత్రం చాలా ఆరోపణలు ఉన్నాయి . పలువురు యువకులను మోసం చేసిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి .

English Title: kollywood actress shruthi fearing with rape attempt