నాని `ట‌క్ జ‌గ‌దీష్‌` నుంచి `కోలో కోల‌న్న కోలో..`!

నాని `ట‌క్ జ‌గ‌దీష్‌` నుంచి `కోలో కోల‌న్న కోలో..`!
నాని `ట‌క్ జ‌గ‌దీష్‌` నుంచి `కోలో కోల‌న్న కోలో..`!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి `కోలో కోలన్న కోలో..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని శ‌నివారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పాట‌లో `ట‌క్ జ‌గ‌దీష్‌` ప్ర‌పంచాన్ని, ఫ్యామిలీతో వుంటే అత‌ని ఎమోష‌న్స్‌ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ లిరిక‌ల్ వీడియో ఆక‌ట్టుకుంటోంది.

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట‌కు త‌మ‌న్ విన‌సొంపైన సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్‌, హ‌రిణి ఇవ‌టూరితో క‌లిసి ఈ పాట‌ని శ్రీ‌కృష్ణ‌, త‌మ‌న్ ఆల‌పించారు. ఉమ్మ‌డి కుటుంబ విలువ‌ల్ని, అందులో వుండే ప్రేమ‌లు, ఆప్యాయ‌త‌ల్ని ఈ పాట క‌ళ్ల‌కు క‌ట్టింది. సినిమా కూడా ఫ్యామిలీ అనుబంధాల‌కు పెద్ద పీట వేస్తూ తెర‌కెక్కించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.