కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రివర్స్ గేర్


Komatireddy Rajagopal Reddy
Komatireddy Rajagopal Reddy

మునుగోడు ఎం ఎల్ ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రివర్స్ గేర్ వేసాడు . నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసి భారతీయ జనతా పార్టీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు, అంతేనా తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు .

అయితే ఎక్కడో తేడా కొట్టింది దాంతో బిజెపి లోకి వెళ్లకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి లాంటిదని , పార్టీ ప్రయోజనం కోసమే నేను విమర్శలు చేశాను తప్ప కాంగ్రెస్ పార్టీ పై కోపంతో కాదు అని అంటున్నాడు . అంతేకాదు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని , అయితే కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి , కుంతియా లకు లేదని అందుకే ఆ కోణంలో మాట్లాడాను తప్ప పార్టీపై కోపంతో కాదని అంటున్నాడు . ఎంతైనా రాజకీయ నాయకుడు కదా ! ఇలాగే మాట్లాడాలి మరి .