నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ వార్తపై స్పందించిన కోన వెంకట్


నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ వార్తపై స్పందించిన కోన వెంకట్
నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ వార్తపై స్పందించిన కోన వెంకట్

అనుష్క ప్రధాన పాత్రలో తెరెకక్కిన నిశ్శబ్దం చిత్రం రిలీజ్ కు చాలా కష్టాలు ఎదుర్కొంది. షూటింగ్ అంతా యూఎస్ లోనే పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట జనవరి 31న విడుదల చేయాలని భావించారు. అది కుదరకపోవడంతో తర్వాత ఏప్రిల్ 2 అని ప్రకటించారు. ఆ రిలీజ్ డేట్ కు సర్వం సిద్ధమవగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. అప్పటినుండి ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేటు ఇచ్చి కొనుగోలు చేసిందని దాదాపు నెలన్నర ముందే వార్తలు వచ్చాయి. అప్పట్లో నిర్మాణ సంస్థ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు గత రెండు రోజుల నుండి మరోసారి ఈ వార్తలు గుప్పుమన్నాయి.

ఈసారి అయితే ఏకంగా అమెజాన్ ప్రైమ్ 26 కోట్ల రూపాయలు ఇచ్చి నిశ్శబ్దం హక్కులను అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేసిందని అన్నారు. ప్రస్తుతం అందరూ ఓటిటి రిలీజ్ లవైపు చూస్తున్న కారణంగా అందరూ ఈ వార్తలు నిజమేనేమో అనుకున్నారు. అయితే నిశ్శబ్దం నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ఈ వార్తలను ఖండించారు. నిశ్శబ్దం గురించిన ప్రస్తావన రాకుండా కోన వెంకట్ చేసిన ట్వీట్ తో అందరికీ క్లారిటీ వచ్చింది.

అందరం ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా అంటే ఎంతో ప్రేమతో ఇక్కడ పనిచేస్తున్నాం. మేం చేసిన పనికి థియేటర్లలో ప్రేక్షకుల స్పందనే మాకు ఆక్సిజన్ వంటిది. అదే మాకు మరింతగా కష్టపడడానికి ప్రేరణ ఇస్తుంది. సినిమా అనేది థియేటర్లలో చూడడానికే. దానికే మా తొలి ప్రాధాన్యత అని ట్వీట్ చేసాడు. ఇక దీంతోనైనా నిశ్శబ్దంపైన రూమర్లు ఆగుతాయేమో చూడాలి.