వెంకీ మామ నుండి అతడు తప్పుకున్నాడట !


నిజ జీవితంలో మామా – అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య లు తెరమీద మామ – అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ” వెంకీ మామ ”. అయితే ఈ సినిమాలో పార్ట్ నర్ గా ప్రముఖ రచయిత కోన వెంకట్ చేరాడు . నిన్నటి వరకు కోన వెంకట్ పేరు ఈ చిత్ర పార్ట్ నర్ లలో ఒకరిగా పేరుంది కానీ ఈరోజు మాత్రం రిలీజ్ చేసిన పోస్టర్ లో కోన వెంకట్ పేరు లేదు దాంతో కోన ఈ సినిమా నుండి తప్పుకున్నాడా ? తప్పించారా ? అన్నది తేలాల్సి ఉంది .

వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించాడు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధించింది . దాంతో మంచి జోష్ లో ఉన్నాడు వెంకీ . ఇక నాగచైతన్య నటించిన మజిలీ చిత్రం కూడా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది . ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న వెంకీ మామ చిత్రానికి పవర్ , జై లవకుశ చిత్రాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వం వహిస్తున్నాడు .