కర‌ణం మ‌ల్లీశ్వరి బ‌యోపిక్ రాబోతోందా?


Kona Venkat planning Karnam Malleswari biopic
Kona Venkat planning Karnam Malleswari biopic

ఎక్క‌డ చూసినా బ‌యోపిక్‌ల హంగామా న‌డుస్తోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ ఏ ఒక్క‌రి క‌థ‌ని వ‌దిలిపెట్ట‌డం లేదు. తెలుగులో బ‌యోపిక్‌ల హంగామా `మ‌హాన‌టి` సినిమాతో మొద‌లైంది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో వ‌రుస బ‌యోపిక్‌లు సెట్స్‌పై వున్నాయి. కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌లుగా నిలిస్తే కొన్ని సెట్స్‌పైకి రాకుండానే ఆగిపోయాయి. తాజాగా మ‌రో బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంది.

వెయిట్ లిప్టింగ్‌లో ఏపీకి ఓలింపిక్స్‌లో బ్రోన్జ్ మెడ‌ల్‌ని తీసుకొచ్చిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవితంపై ఓ సినిమాని తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త రెండేళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా కోన వెంక‌ట్ మాత్రం ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చిన‌ట్టు తెలిసింది. శ్రీ‌కాకుళంలోని మారుమూల గ్రామం నుంచి ఒలింపిక్స్ వ‌ర‌కు వెళ్లిన ఓ సాధార‌ణ మ‌హిళ అసాధార‌ణ ప్ర‌యాణం నేప‌థ్యంలో ప్ర‌తి హృద‌యాన్ని హ‌త్తుకునే క‌థ‌. క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

2000 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో భార‌త్‌కు ప‌త‌కాన్నిఅందించిన తొలి మ‌హిళా క్రీడాకారిణిగా మ‌ల్లీశ్వ‌రి పేరు రికార్డుల్లో నిలిచింది. ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వున్న ఈ సినిమాలో మ‌ల్లీశ్వ‌రిగా ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా న‌టించాలంటే ఇప్పుడున్న హీరోయిన్‌ల‌లో ఎవ‌రూ సూట‌వ్వ‌రు. మ‌రి కోన ఎవ‌రిని రంగంలోకి దించుతారో వేచి చూడాలి.