కొండా సురేఖ వల్ల టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం


Konda surekha angry on TRSకొండా సురేఖకు వరంగల్ జిల్లాలో మంచి పట్టు ఉంది , పెద్ద ఎత్తున అనుచరవర్గం కూడా ఉంది దాంతో వరంగల్ ఈస్ట్ తో పాటుగా పరకాల , భూపాలపల్లి లో టీఆర్ఎస్ కు ఆ మూడు నియోజక వర్గాల్లో ఇబ్బంది తప్పదు అంతేకాదు కొండా వర్గం గట్టిగా తలపెడితే ఆ మూడు చోట్ల టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . తాజా మాజీ ఎo ఎల్ ఏ అయిన కొండా సురేఖకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల కొండా సురేఖ తో పాటుగా ఆమె కూతురు అలాగే కొండా మురళి కూడా పోటీకి సిద్దపడుతున్నారట .

వరంగల్ ఈస్ట్ లో భూపాలపల్లి లో పరకాల లో మూడు చోట్ల పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ మూడు నియోజక వర్గాల్లో కొండా సురేఖ దంపతులకు బాగా పట్టుంది . పైగా టికెట్ ఇవ్వకుండా కొండా దంపతులను అవమానించడంతో కసితో రగిలిపోతున్నారు కొండా దంపతులు అలాగే ఆమె అనుచర వర్గం కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల ఆగ్రహంగా ఉన్నారు . దాంతో తప్పకుండా మూడు చోట్లా పోటీ చేసి కేసీఆర్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు . అనుచరుల వత్తిడితో మూడు చోట్లా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కొండా దంపతులు .

English Title: Konda surekha angry on TRS