కొండా సురేఖ బీజేపీ లోకి ?


Konda Surekha
Konda Surekha

మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తోందట . కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు ఉన్న కొండా సురేఖ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది . అయితే జగన్ తో వచ్చిన ఇబ్బందులతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ నుండి పోటీ చేసి గెలిచింది .

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో వచ్చిన ఇబ్బందులతో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయింది . కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఖతం అయ్యే పార్టీ కాబట్టి కేసీఆర్ ని ఎదురించాలంటే బీజేపీ లోకి వెళ్లడమే కరెక్ట్ అని భావిస్తోందట . ఇక బీజేపీ పెద్దలు కూడా కొండా సురేఖ చేరిక పట్ల సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే బీజేపీ లో చేరడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .