మెగా డాట‌ర్ ఎంగేజ్‌మెంట్ నేడే!మెగా డాట‌ర్ ఎంగేజ్‌మెంట్ నేడే!
మెగా డాట‌ర్ ఎంగేజ్‌మెంట్ నేడే!

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా జోరందుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్నా సెల‌బ్రిటీల పెళ్లిళ్లు మాత్రం ఆగ‌డం లేదు. వ‌రుస‌గా స్టార్ హీరోలు త‌మ బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చె‌ప్పేస్తూ ఓ ఇంటివార‌వుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరోలు నిఖిల్‌, నితిన్‌, రానా, ద‌ర్శ‌కుడు సుజీత్ వ‌రుస‌గా వివాహాలు చేసుకున్న విష‌యం తెలిసిందే.

తాజాగా మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. గుంటూరుకు చెందిన ఐజీ కుటుంబానికి చెందిన చైత‌న్య‌ని నిహారిక గ‌త కొంత కాలంగా ప్రేమిస్తోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇరు కుటుంబాల వాళ్లు వీరి వివాహానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. చైత‌న్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు. వీరి వివాహాన్ని డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌నుకుంటున్నామ‌ని నాగ‌బాబు స్ప‌ష్టం చేశారు.

నిహారిక ఎంగేజ్‌మెంట్‌కు మెగా ఫ్యామిలీ ఈ రోజే ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు మెగా డాట‌ర్ నిహారిక‌, చైత‌న్య‌ల నిశ్చితార్థం హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. ఈ కార్య‌‌క్ర‌మానికి ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత కీల‌క వ్య‌క్తులు, అత్యంత ఆప్తులు యాత్ర‌మే పాల్గొన‌బోతున్నార‌ని తెలిసింది.