రాజమౌళి రూట్ ను ఫాలో అవుతున్న కొరటాల


రాజమౌళి రూట్ ను ఫాలో అవుతున్న కొరటాల
రాజమౌళి రూట్ ను ఫాలో అవుతున్న కొరటాల

టాలీవుడ్ లో అపజయమన్నది ఎరుగని దర్శకులు అనగానే మనకు గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఒక్క ప్లాప్ లేకుండా 100 పెర్సంట్ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు రాజమౌళి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ప్లాప్ అన్నది లేకుండా కొనసాగుతున్న మరో దర్శకుడు కొరటాల శివ.

చేసిన నాలుగు సినిమాలూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో కొరటాల శివకు కూడా టాలీవుడ్ లో ఫాలోయింగ్ బానే పెరిగింది. ప్రస్తుతం చిరంజీవితో తన సినిమా చేయడానికి సిద్ధమవుతున్న కొరటాల శివ, రాజమౌళి రూట్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. గత నాలుగైదు సినిమాల నుండి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలుపెట్టేముందో, లేక మొదలుపెట్టిన తర్వాతో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా విశేషాలను తెలియజేయడం అలవాటు చేసుకున్నాడు.

కొన్ని నెలల క్రితం ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో కూడా రాజమౌళి ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా ఏ జోనర్ లో ఉండనుందో, ఎలాంటి సినిమా ఆశించవచ్చో డీటెయిల్స్ చెప్పాడు. ఇప్పుడు సేమ్ కొరటాల శివ కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నాడు. చిరంజీవితో తను తీయబోయే సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ ఉన్నాయి. వీటిన్నంటినీ ఒక ప్రెస్ మీట్ తో చెరిపేసి తన సినిమా ఎలా ఉంటుందో ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేస్తాడన్నమాట.