కొరటాల దేవికి హ్యాండ్ ఇవ్వనున్నాడా?


koratala shiva to part ways with devi sri prasad
koratala shiva to part ways with devi sri prasad

కొంతమంది దర్శకులకు ఒకరితో పనిచేయడం కంఫర్ట్ అనిపించాక వేరే వారి దగ్గరకి వెళ్ళడానికి ఇష్టపడరు. సుకుమార్, కొరటాల శివ లాంటి వారు అందుకే తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ నే పెట్టుకునేవారు. అయితే గత కొంతకాలంగా దేవిశ్రీ మ్యూజిక్ విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మునుపటి రేంజ్ లో పాటలు లేవన్నది వాస్తవం.

ఈ విషయాలు పక్కనపెడితే కొరటాల శివ ఇప్పుడు దేవిశ్రీతో అనుబంధాన్ని తెంచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమాకు దేవిశ్రీ పనిచెయ్యట్లేదట.

ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం అజయ్ – అతుల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. నవంబర్ లో కొరటాల శివ – చిరు సినిమా పట్టాలెక్కుతుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.