చిరు లుక్స్ మార్చే పనిలో కొరటాల శివ


koratala siva working on chiru looks
koratala siva working on chiru looks

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుకానున్న నేపథ్యంలో చిరు మరింత బిజీగా మారనున్నారు. అయితే సైరా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెల్సిందే.

చిరు సైరా పనులతో బిజీగా ఉంటే, కొరటాల శివ మాత్రం చిరు తర్వాతి సినిమాకు కసరత్తులు చేస్తున్నాడు. ఒకవైపు నటీనటులను, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుండగా, మరోవైపు శివ, చిరుకు సరికొత్త లుక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే చిరుపై ఒక టెస్ట్ లుక్ ను చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చిరు లుక్ సరికొత్తగా అందరినీ అలరించేదిగా ఉంటుందని తెలుస్తోంది.