జనవరిలో చిరు – కొరటాల కొత్త సినిమా


Koratala siva chiranjeevi movie starts from january 2019

2019 జనవరిలో మెగాస్టార్ చిరంజీవికొరటాల శివ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుంది . కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రాంచరణ్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం . కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటివరకు నాలుగు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . దానికి తోడూ మెగాస్టార్ సినిమా కాబట్టి అందునా సైరా నరసింహారెడ్డి తర్వాత వచ్చే సినిమా కాబట్టి అంచనాలు స్కై లెవల్లో ఉంటాయి .

స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యిందని , త్వరలోనే చిరంజీవి కి పూర్తీ నరేషన్ మరోసారి ఇవ్వడమే బ్యాలెన్స్ గా ఉందని తెలుస్తోంది . కొరటాల శివ సినిమాలన్నీ సామాజిక సందేశంతో కూడుకున్న చిత్రాలు అన్న విషయం అందరికి తెలిసిందే . కాగా ఈ సినిమా కూడా సందేశాత్మకంగా ఉండనుంది . ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే . ఆ సినిమాని కంప్లీట్ చేసి వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జనవరిలో సినిమా ప్రారంభం అయినప్పటికీ కొంత గ్యాప్ తీసుకొని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు .

English Title: Koratala siva chiranjeevi movie starts from january 2019