స్టార్ డైరెక్ట‌ర్ లీగ‌ల్ యుద్ధం!


స్టార్ డైరెక్ట‌ర్ లీగ‌ల్ యుద్ధం!
స్టార్ డైరెక్ట‌ర్ లీగ‌ల్ యుద్ధం!

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తిపై లీగ‌ల్ యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర‌లోని కీల‌క అతిథి పాత్ర‌లో హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల చిరంజీవి పుట్టిన రోజున‌ ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మోష‌న్ పోస్టర్ చూసిన రాజేష్ అనే ర‌చ‌యిత త‌న క‌థ‌నే కొర‌టాల కాపీ కొట్టాడ‌ని మీడియా కెక్క‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీనిపై చిత్ర వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి. మైత్రీ మూవీమేక‌ర్స్ కూడా `ఆచార్య‌` క‌థ‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

ఈ వివాదంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. చిన్న మోష‌న్ పోస్ట‌ర్ చూసి ఇది త‌న క‌థే అంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించిన ఆయ‌న ర‌చయిత రాజేష్‌పై ప‌రువు న‌ష్టం దావాకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఓ మీడియాకిచ్చిన లైవ్‌లో కొర‌టాల ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటాన‌ని హెచ్చ‌రించిన‌ట్టే ప‌రువు న‌ష్టం దావాకు దిగుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.