షూటింగ్స్ లేవు.. అయినా ఆయ‌న‌కు..!


షూటింగ్స్ లేవు.. అయినా ఆయ‌న‌కు..!
షూటింగ్స్ లేవు.. అయినా ఆయ‌న‌కు..!

షూటింగ్స్ లేవు, త‌ను చేస్తున్న సినిమాల షూటింగ్స్ ఇప్ప‌ట్లో మొద‌ల‌య్య అవ‌కాశం లేదు. అయినా ఓ స్టార్ డైరెక్ట‌ర్ కి మాత్రం డ‌బ్బులొస్తున్నాయ‌ట‌. అదేంటి? ఎవ‌రా ద‌ర్శ‌కుడు అంటే ఆయ‌నే కొర‌టాల శివ‌. `మిర్చి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. క‌రోనా దెబ్బ‌తో షూటింగ్ ఇప్ప‌ట్లో రీ స్టార్ట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. వ్యాక్సిన్ వ‌స్తే గానీ షూటింగ్స్ స్టార్ట్ కావ‌ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా వుంటే `భ‌ర‌త్ అనే నేను` సినిమా త‌రువాత `ఆచార్య‌` అంగీక‌రించిన కొర‌టాల శివ త‌న సినిమా షూటింగ్ ఆగిపోయినా త‌న‌కు మాత్రం పారితోషికాలు వ‌స్తూనే వున్నాయ‌ట‌.

కొర‌టాల ద‌ర్శ‌కుడు కాక‌ముందు రైట‌ర్‌. ఆ అనుభ‌వం, కొర‌టాల పెన్ను బ‌లం తెలిసిన నిర్మాత‌లు త‌మ సినిమాల స్క్రిప్ట్ క‌రెక్ష‌న్ కోసం ఇప్ప‌టికీ కొర‌టాలని సంప్ర‌దిస్తున్నార‌ట‌. ఈ విధంగా కొర‌టాల త‌న సినిమా షూటింగ్ ఆగిపోయినా స్క్రిప్ట్ క‌రెక్ష‌న్‌ల రూపంలో ఆదాయం కొర‌టాల ఖాతాలో వ‌చ్చిప‌డుతూనే వుంద‌ని ఇండ‌స్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.