రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కి అద‌న‌పు హంగులా?


రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కి అద‌న‌పు హంగులా?
రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కి అద‌న‌పు హంగులా?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కు అద‌న‌పు హంగుల్ని జోడిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఏంటీ `ఆర్ఆర్ఆర్`లో అనుకుంటున్నారా కాదు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. త‌న ప్ర‌తి చిత్రంలో ఓ స‌మ‌కాలీన అంశాన్ని జోడించి తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని కూడా అదే త‌ర‌హా క‌థ‌తో రూపొందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఎండోమెంట్ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో ఫైన‌ల్‌గా హీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ముందు ఈ పాత్ర కోసం మ‌హేష్‌బాబుని అనుకున్నారు. దాంతో ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టుగా పాత్ర‌‌ని సిద్ధం చేసిన కొర‌టాల ఆ పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నుండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్టుగా మార్పులు చేస్తున్నారట‌.

రెబ‌ల్ స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్న ఈ పాత్ర‌కు ముందు పాట‌లు లేవ‌ని, సీరియ‌స్‌గా సాగుతుంద‌ని తెలిసింది. అయితే తాజా మార్పుల్లో ఈ పాత్ర‌కు ఓ రొమాంటిక్ సాంగ్‌, ఓ బిట్ సాంగ్‌ని జోడించార‌ట‌. డైలాగ్స్‌ని కూడా మ‌ళ్లీ మారుస్తున్నార‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలిసింది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. రామ్‌చ‌ర‌ణ్ పాత్ర కోసం మాత్రం ఇంకా హీరోయిన్‌ని మాత్రం ఫైన‌ల్ చేయ‌లేదు. లాక్ డౌన్ త‌రువాత ఫైన‌ల్ చేసే అవ‌కాశాలు వున్న‌ట్టు తెలిసింది.