మళ్ళీ ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా


koratala siva movie again with jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ” జనతా గ్యారేజ్ ” వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది . ఎన్టీఆర్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది వసూళ్ల పరంగా దాంతో మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది . కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన నాలుగు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి . ఇక ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి తో మరో సందేశాత్మక చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మళ్ళీ సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నాడు కొరటాల శివ . ఇంతకుముందు కూడా మహేష్ బాబు తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసాడు కొరటాల . మొదట శ్రీమంతుడు చేసాడు అది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దాని తర్వాత భరత్ అనే నేను చిత్రం చేయగా అది కూడా మళ్ళీ మహేష్ రికార్డులను బద్దలు కొట్టి భరత్ అనే నేను చిత్రం నెంబర్ వన్ గా నిలిచింది . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ తో మళ్ళీ సినిమా చేయనున్నాడట ! జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఎన్టీఆర్ కూడా కొరటాల తో మళ్ళీ సినిమా చేయడానికి అంగీకరించాడట అయితే కథ సెట్ కావాల్సి ఉంది . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అరవింద సమేత ” వీర రాఘవ చిత్రం చేస్తున్నాడు .

English Title: koratala siva movie again with jr ntr