బ‌న్నీ కోసం చిరు డైరెక్ట‌ర్‌కు భారీ ఆఫ‌ర్‌!


బ‌న్నీ కోసం చిరు డైరెక్ట‌ర్‌కు భారీ ఆఫ‌ర్‌!
బ‌న్నీ కోసం చిరు డైరెక్ట‌ర్‌కు భారీ ఆఫ‌ర్‌!

కొర‌టాల శివ‌.. రైట‌ర్‌గా మొద‌లైన ఆయ‌న తొలి సినిమా `మిర్చి`తో స్టార్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో చేరిపోయారు. ఆ త‌రువాత కూడా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన మార్కుని సొంతం చేసుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో రెబ‌ల్ స్టూడెంట్ లీడ‌ర్‌గా న‌టిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌ని బ‌ట్టి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిం కానుంది. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత కొర‌టాల శివ మ‌రో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త చిత్రాల రికార్డుని దృష్టిలో పెట్టుకున్న అల్లు అర‌వింద్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. బ‌న్నీతో సినిమా చేస్తే 13 కోట్లు పారితోషికం ఇస్తానంటూ అల్లు అర‌వింద్ ఆఫ‌ర్ చేశార‌ట‌.

ఇప్ప‌టికే బ‌న్నీకి కొర‌టాల స్క్రిప్ట్ వినిపించార‌ని, దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డనుంద‌ని తెలిసింది. బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ టైమ్ ప‌ట్టేలా వుంద‌ని తెలిసింది.