విజయ్ దేవరకొండతో కొరటాల శివ


Koratala siva planning film with vijay devarakonda

విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ దర్శకులు కొరటాల శివ కు ఎప్పటి నుండో ఉందట ముఖ్యంగా పెళ్ళి చూపులు చిత్రం చూసిన తర్వాత అనుకన్నాడట ! ఈలోగా అర్జున్ రెడ్డి వచ్చింది ఇంకేముంది విజయ్ దేవరకొండ లోని మరో కోణాన్ని చూపించింది . సరే ! అలాంటి స్టొరీ ఒకటి రాసుకుందామని అనుకునేలోగా గీత గోవిందం వచ్చింది దాంతో వీటికి భిన్నంగా విజయ్ దేవరకొండ తో ఏదో చేయాలనీ ఉందట కొరటాల శివకు . వరుసగా చేసిన నాలుగు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో కొరటాల శివతో సినిమా చేయడానికి పలువురు హీరోలు పోటీ పడుతున్నారు అయితే కొరటాల మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు .

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడు కొరటాల . చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ ముగించుకొని కొరటాల శివ తో జాయిన్ అవుతాడు . వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా ప్రారంభం కానుండగా చిరుతో సినిమా కంప్లీట్ చేసాక విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సందేశాత్మక చిత్రాలు చేసే కొరటాల విజయ్ దేవరకొందతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి .

English Title: Koratala siva planning film with vijay devarakonda