అఖిల్ తో సినిమా చేయలేనని చెప్పాడట


koratala siva rejected akhil offerఅక్కినేని అఖిల్ ని హీరోగా నిలబెట్టడానికి నాగార్జున చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు కానీ నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాపం అఖిల్ కు మాత్రం కలిసి రావడం లేదు . మనం తో అఖిల్ మీద అంచనాలు పెరిగినప్పటికీ ఆ తర్వాత చేసిన అఖిల్ డిజాస్టర్ అయ్యింది , ఇక హలో చిత్రం అంతగా ఆడలేదు దాంతో కొరటాల శివ కు 15 కోట్ల ఆఫర్ ఇచ్చాడట నాగార్జున .

 

అఖిల్ తో కనుక సినిమా చేస్తే 15 కోట్లు ఇస్తానని కొరటాల శివ కు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఇప్పట్లో అఖిల్ తో సినిమా చేయలేను సార్ అంటూ సున్నితంగా తిరస్కరించించాడట కొరటాల . మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ లతో కొరటాల శివ ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు . నాగార్జున లాంటి టాప్ స్టార్ ఆఫర్ ఇస్తే కొరటాల రిజెక్ట్ చేయడం పెద్ద చర్చగా మారింది .