మళ్ళీ మొదటికి.. కొరటాల శివ నెక్స్ట్.. బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరితో?

మళ్ళీ మొదటికి.. కొరటాల శివ నెక్స్ట్.. బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరితో?
మళ్ళీ మొదటికి.. కొరటాల శివ నెక్స్ట్.. బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరితో?

కొరటాల శివ తన కెరీర్ లో ఇప్పటివరకూ చేసినవి నాలుగు సినిమాలే అయినా కూడా వాటితో తన రేంజ్ ను చూపించాడు. నాలుగుకు నాలుగు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ సాధించాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ ఎవరితో పనిచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

కొరటాల శివ.. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కమిటైన విషయం తెల్సిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. పుష్ప పూర్తైన వెంటనే కొరటాల శివ మొదలుపెడతారని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం శివ ముందుగా ఎన్టీఆర్ తో చేసి తర్వాత బన్నీతో చేస్తాడని అంటున్నారు. అయితే అది జరగడం కష్టమే. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయాలి. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా రెడీగా ఉంది. మరి ఈ రూమర్ ఎక్కడినుండి వచ్చిందో మాత్రం తెలీదు.