కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్ టాక్


Kousalya Krishnamurthy Trailer Talk
Kousalya Krishnamurthy Trailer Talk

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం ” కౌసల్య కృష్ణమూర్తి ”. రీమేక్ కింగ్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అగ్ర నిర్మాత కెఎస్ రామారావు , వల్లభ నిర్మించారు . తమిళంలో సూపర్ హిట్ అయిన కణా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు . ఇక ఈ సినిమా ఈనెల 23 న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని విడుదల చేసారు . ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది .

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ , రాజేంద్రప్రసాద్ లు తండ్రీ కూతుర్లుగా నటించారు . తండ్రి కలని నిజం చేసే కూతురు పాత్రలో ఐశ్వర్య నటిస్తోంది . ఆల్రెడీ తమిళ్ లో పెద్ద హిట్ కాబట్టి ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి . ఈనెల 23న విడుదల అవుతున్న చిత్రాల్లో కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి మాత్రమే కాస్త మొగ్గు ఉంది . తమిళంలో హిట్ అయ్యింది అయితే తెలుగులో ఏమౌతుందో ఈనెల 23 న తేలనుంది .