దేవదాసు హిట్ అవ్వడం కష్టమేనా ?



Koushal army angry on nanis devadas

అక్కినేని నాగార్జున , నాని , రష్మిక మందన్న , ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన దేవదాస్ చిత్రం ఈనెల 27న విడుదలకు సిద్దమయ్యింది అయితే ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు దాంతో ఈ సినిమా హిట్ అవుతుందా ? అనే అనుమానాలు నెలకొన్నాయి దానికి తోడు నాని పై బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ ఆర్మీ పగబట్టి ఉంది దాంతో కూడా దేవదాస్ హిట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి . నాని బిగ్ బాస్ 2 సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే హోస్ట్ లో భాగంగా నాని కి కౌశల్ కు మధ్య కాస్త వార్ జరిగింది అప్పటినుండి కౌశల్ పట్ల అనుకూలంగా వ్యవహరించడం లేదని కౌశల్ ఆర్మీ నానిపై ఆగ్రహంగా ఉన్నారు . అందులో భాగంగా దేవదాస్ చిత్రాన్ని ప్లాప్ చేస్తామని ప్రతిన బూనారు .

కట్ చేస్తే ఇప్పుడు కౌశల్ ఆర్మీ కి చేతినిండా పనిదొరికింది . దేవదాస్ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం ఏమాత్రం బాగోలేకపోయినా నిమిషాల్లో ఆ సినిమా పట్ల వ్యతిరేకత ని ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేలా చేయడానికి సమాయత్తం అవుతున్నారట !కౌశల్ ఆర్మీ విషయం పక్కన పెడితే దేవదాస్ చిత్రం పై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . ఇద్దరు స్టార్ హీరోలు నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది కానీ ఆ స్థాయిలో మాత్రం బజ్ లేదు దాంతో దేవదాస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి .

English Title: Koushal army angry on nanis devadas