నాని పై పగబట్టడానికి కౌశల్ ఆర్మీ కి బలమైన కారణమే ఉంది. నటుడు , మోడల్ అయిన కౌశల్ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక నాని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ 2 హౌజ్ లో మొదటి నుండి కూడా కౌశల్ కు నాని సపోర్ట్ చేయలేదు ,పైగా కొన్ని సందర్భాల్లో కౌశల్ ని ఇబ్బంది పెట్టాడు కూడా దాంతో కౌశల్ ఆర్మీ నానిపై పగబట్టింది. కౌశల్ ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరిని ఒక్కొక్కరిగా ఎలిమినెట్ అయ్యేలా చేశారు కౌశల్ ఆర్మీ అయితే నాని ని ఎలిమినెట్ చేసే శక్తి కౌశల్ ఆర్మీ కి లేదు కాబట్టి నాని నటించిన దేవదాస్ పై దృష్టి పెట్టారు. ఆ సినిమా విడుదల అవుతుందని ప్రకటించగానే ప్లాప్ చేస్తామంటూ సవాల్ విసిరారు. కట్ చేస్తే దేవదాస్ రానే వచ్చింది.సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడం లేదు దాంతో టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేశారు. ఇక దేవదాస్ పై డివైడ్ టాక్ రావడానికి కారణం కౌశల్ ఆర్మీ నే కారణమని నమ్ముతున్నాడట నాని .
English Title: Koushal army happy with nani’s devadas failure