హీరో రాజశేఖర్ సోదరుడిపై దాడి


Koushik reddy beats hero dr. rajasekhar's brother

హీరో డాక్టర్ రాజశేఖర్ సోదరుడిపై దాడి జరిగింది . దాంతో గాయాల పాలైన రాజశేఖర్ సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . ఫిబ్రవరి 3 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ కాగా గతకొంత కాలంగా డైమండ్స్ అండ్ జువెల్లర్స్ షాప్ నిర్వహిస్తున్నాడు . అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి బంధువు అయిన కౌశిక్ రెడ్డి గుణ షాప్ ముందు తన కారుని పార్క్ చేసి పక్కనే ఉన్న పబ్ కి వెళ్ళాడు .

చాలా సమయం తర్వాత వచ్చిన కౌశిక్ రెడ్డి ని తన షాప్ ముందు కారు పెట్టి ఎందుకు వెళ్లావని అడగడంతో సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి గుణశేఖర్ పై దాడి చేసాడు . దాడిలో గాయపడిన గుణశేఖర్ ఆసుపత్రిలో చేరాడు . ఈ విషయం రాజశేఖర్ – జీవితలకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

English Title: Koushik reddy beats hero dr. rajasekhar’s brother