ర‌వితేజ `క్రాక్‌` సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ మారింది!


ర‌వితేజ `క్రాక్‌` సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ మారింది!
ర‌వితేజ `క్రాక్‌` సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ మారింది!

గోపీచంద్ మ‌లినేని, మాస్ రాజా ర‌వితేజ క‌ల‌యికలో ముచ్చ‌ట‌గా వ‌స్తున్న మూడ‌వ చిత్రం `క్రాక్‌`. గ‌త కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ జోడీ ఈ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో వున్నారు. ఆ విష‌యం ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌తో తెలిసిపోయింది. జ‌న‌వ‌రి 1న న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్‌లో వుంది.

ట్రైల‌ర్‌లో ర‌వితేజ పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు, ప‌లికించిన డైలాగ్‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని స్ర‌వంతి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ క‌నిపించ‌బోతున్నారు. వీరిద్ద‌రి పాత్ర‌లు కూడా ర‌వితేజ పాత్ర‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ప‌వ‌ర్‌ఫుల్‌గా వుండ‌నున్నాయి.

శ‌నివారం ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. U/A ల‌భించింది. చిత్రాన్నిముందు అనుకున్న‌ట్టు ఈ నెల 14న కాకుండా 9నే విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. సీ యూ సూన్‌. క‌లుద్దాం థియేట‌ర్ లో మ‌రి అని స్ప‌ష్టం చేశారు. మాస్ మ‌సాల యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీతో ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని హ్యాట్రిక్ హిట్‌ని సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.