`క్రాక్‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌!

`క్రాక్‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌!
`క్రాక్‌` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ అదుర్స్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌‌క‌త్వంలో స‌ర‌స్వ‌‌తీ ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంక్రాంతికి ఐవు రోజుల ముందే ఈ నెల 9న విడుద‌లైన ఈ చిత్రం సాలీడ్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. గ‌త కొంత కాలంగా హిట్ మాట విన‌ని ర‌వితేజ‌కు ట్రెమండ‌స్ హిట్‌ని అందించింది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ని మ‌ళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ వ‌రుస‌గా మూడు ఫ్లాపుల్ని చూశారు. ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ఈ మూవీ తొలి వారం భారీ స్థాయిలో క‌లెక్ష‌న్‌ల‌ని సాధించింది. 21 కోట్ల‌కు బిజినెస్ అయిన ఈ మూవీ తొలి వారానికే ఆ మొత్తాన్ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సాధించ‌డం విశేషం.

`క్రాక్‌` మూవీ ఏపీ, తెలంగాణ‌ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్ విరాలు:

నైజామ్ : 7.10 కోట్లు
సీడెడ్ : 3.7 కోట్లు
వైజాగ్  : 2.30 కోట్లు
గుంటూరు : 1. 77 కోట్లు
కృష్ణా : 1. 47 కోట్లు
ఈస్ట్ గోదావి : 1.90 కోట్లు
వెస్ట్ గోదావరి : 1. 68 కోట్లు
నెల్లూరు : 1. 1 కోటి

మొత్తం ఉభ‌‌య తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో క్రాక్ బ్రేక్ ఈవెన్ అయిన‌ట్టే అంటున్నారు.