క్రాక్ మూవీ రివ్యూ

క్రాక్ మూవీ రివ్యూ
క్రాక్ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రవితేజ, శ్రుతిహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్
ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మలినేని
నిర్మాత‌:  బి. మధు
సంగీతం: త‌మ‌న్‌
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిసన్ బ్యానర్
రిలీజ్ డేట్: 09–01–2021
రేటింగ్: 3/5

మాస్ మహారాజా రవితేజ గత కొంత కాలంగా ప్లాపులతో ఇబ్బంది పడుతోన్న విషయం తెల్సిందే. అయితే రవితేజ నటించే ప్రతీ సినిమాకూ బజ్ క్రియేట్ అవ్వడం మాత్రం సాధారణమే. క్రాక్ సినిమాపై అంతటా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈసారి రవితేజ ఎలాగైనా హిట్ కొట్టి తీరతాడని అందరూ ఆశించారు. అయితే నిన్న మార్నింగ్ షోస్ తో విడుదలవ్వాల్సిన క్రాక్, కొన్ని ఇబ్బందుల కారణంగా రాత్రి ఆటతో ప్రారంభమైంది. మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న క్రాక్ ఎలా ఉందో చూద్దామా?

కథ:
పోతురాజు వీర శంకర్ (రవితేజ) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అన్యాయం జరిగితే సహించలేడు. తన భార్య (శృతి హాసన్), పిల్లాడితో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోన్న శంకర్ కు ఒంగోలు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ కఠారి శ్రీను అన్యాయాలు హెచ్చుమీరుతుంటాయి. శ్రీను చేయించిన ఒక మర్డర్ శంకర్ కు కోపం తెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో శంకర్ తీసుకున్న చర్యలేమిటి? వీరిద్దరి మధ్య వైరం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది వంటివి సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:
రవితేజ మరోసారి తన ఎనర్జీను ఈ సినిమాలో చూపించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి చురుకైన ప్రదర్శన ఇచ్చాడు రవితేజ. పోతురాజు వీర శంకర్ పాత్రలో రవితేజ నటన సూపర్బ్. శృతి హాసన్ కు మంచి పాత్ర దక్కింది. ఇక సముధ్రఖని తన నటనతో మెప్పించాడు. రవితేజకు ధీటైన పాత్రలో అలరించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నెగటివ్ పాత్రలో ఆకట్టుకుంది. ఇక మిగిలిన వాళ్ళు తమ పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
గోపీచంద్ మలినేని ఒక రొటీన్ స్టోరీకు కమర్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. కథ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేకపోయినా కమర్షియల్ ఫ్యాక్టర్స్ ను బాగా వాడుకున్నాడు. దర్శకుడిగా గోపీచంద్ కు మంచి మార్కులే పడతాయి. తర్వాత ప్రస్తావించుకోవాల్సింది సంగీతం గురించే. ఎస్ ఎస్ థమన్ మరోసారి తాను టాప్ ఫామ్ లో ఉన్నాను అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు. పాటల కన్నా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అదరగోట్టాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి.

చివరిగా:
మాస్ మహారాజా నుండి ఎలాంటి సినిమాను ఆశిస్తున్నారో సరిగ్గా అలాంటి చిత్రమే క్రాక్. సంక్రాంతికి సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పడింది. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ను ఈ చిత్రం ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి. చాలా కాలం తర్వాత రవితేజ నుండి హిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.