సంక్రాంతి పోస్ట‌ర్ కిర్రాక్‌గా వుందిగా!


సంక్రాంతి పోస్ట‌ర్ కిర్రాక్‌గా వుందిగా!
సంక్రాంతి పోస్ట‌ర్ కిర్రాక్‌గా వుందిగా!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కొంత విరామం త‌రువాత స్పీడు పెంచారు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` త‌రువాత ఏడాది విరామం తీసుకున్నఆయ‌న ప్ర‌స్తుతం వ‌రుసగా రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. సైంటిఫిక్ యాక్ష‌న్‌ డ్రామాగా “డిస్కోరాజా`, మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైనర్‌గా `క్రాక్‌` చిత్రాలు రూపొందుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `డిస్కోరాజా` ఫ‌స్ట్‌లుక్‌తో మాంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తాజాగా `క్రాక్‌` సినిమా సంక్రాంతి పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో క్రాక్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న నుంచి సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్ల‌వుతోంది. ఈ సారి ఎలాగైనా ప‌వ‌ర్‌ఫుల్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మంగ‌ళ‌వారం రిలీజ్ చేసిన సంక్రాంతి పోస్ట‌ర్‌ ఆక‌ట్టుకుంటోంది. హీరోయిన్ శృతిహాస‌న్ లుక్‌ని రివీల్ చేశారు.

శృతిహాస‌న్ బుల్లెట్ న‌డుపుతుండ‌గా, మాస్ రాజా ర‌వితేజ పంచెక‌ట్టుకుని, త‌ల‌పాగా చుట్టుకుని రెండు చేతుల్లో స్టీల్ క్యాన్స్ ప‌ట్టుకుని, రెబాన్ గ్లాస్ పెట్టుకుని వెన‌కాల కూర్చున్న ఫొటో కిర్రాక్‌గా వుంది. ముందు ఓ బుడ‌త‌డు కూర్చుని క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తోంది. ఇంత‌కు ముందు ర‌వితేజ‌, శృతిహాస‌న్ క‌లిసి `బ‌లుపు` చిత్రంలో న‌టించారు. ఆ సెంటిమెంట్ ప్ర‌కారం మ‌రోసారి `బ‌లుపు` క‌ల‌యిక‌లో వ‌స్తున్నఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమా వుండ‌బోతోంద‌ని, `బ‌లుపు` మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాయి.