షాకిచ్చిన క్రిష్ న్యూ మూవీ టీమ్‌!

షాకిచ్చిన క్రిష్ న్యూ మూవీ టీమ్‌!
షాకిచ్చిన క్రిష్ న్యూ మూవీ టీమ్‌!

క్రిష్ టీమ్ తాజాగా షాకిచ్చింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని రూపొందిస్తున్న క్రిష్ క‌రోనా క్రైసిస్ కార‌ణంగా ఆ మూవీ షూటింగ్‌ని టు షెడ్యూల్స్ త‌రువాత ఆపేశారు. మ‌ళ్లీ తిరిగి ప్రారంభించాలంటే వ్యాక్సిన్ రావాల్సిందేన‌ని ప‌వ‌న్ చెప్ప‌డంతో ఆ స‌మ‌యాన్ని మ‌రో చిత్రానికి కేటాయించారు క్రిష్‌. సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా క్రిష్ ఓ చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

పాపుల‌ర్ న‌వ‌ల `కొండ పొలం` ఆధారంగా వాస్త‌విక కోణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌కుల్ కూడా ఇటీవ‌లే చిత్ర‌బృందం తో క‌లిసి షూటింగ్‌లో  పాల్గొంది. రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ వున్న‌ట్టుండి ఆగిపోయింది. దీంతో అంతా షాక్‌కు గుర‌య్యారు. అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే ఆపేయ‌డ‌మేంట‌ని అంతా ఆరాతీయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ చిత్ర టీమ్‌లో కీల‌క వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్టు తెలిసింది. దీంతో ద‌ర్శ‌కుడు క్రిష్ మూవీ షూటింగ్‌ని ఆపేశార‌ట‌. ఈ విష‌యం తెలిసి వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ షాక్‌కు గురైన‌ట్టు తెలిసింది. స‌ద‌రు వ్య‌క్తితో కాంటాక్ట్ అయిన వారంతా క్వారెంటైన్‌కి వెళ్లాల‌ని క్రిష్ సూచించ‌డంతో టీమ్ అంతా హోమ్ క్వారెంటీన్‌కి ప‌రిమిత‌మైన‌ట్టు తెలుస్తోంది.