స్టార్ డైరెక్ట‌ర్ సినిమాపై అది రూమ‌రే అంటున్నారే?


స్టార్ డైరెక్ట‌ర్ సినిమాపై అది రూమ‌రే అంటున్నారే?
స్టార్ డైరెక్ట‌ర్ సినిమాపై అది రూమ‌రే అంటున్నారే?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. పిరియాడిక్ స్టోరీతో అత్యంత భారీ తారాగ‌ణంతో హాలీవుడ్ సినిమాల‌కి ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఈ  చిత్రాన్ని క్రిష్ ప్లాన్ చేశారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం ఈ పిరియాడిక్ డ్రామాని నిర్మిస్తున్నారు. సైలెంట్‌గా టు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి.

మ‌రో షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాల‌ని ప్లాన్ చేసే లోపు క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో క్రిష్ ఈ స‌మ‌యాన్ని చిన్ని సినిమాకి వాడుకోవాల‌ని పాపుల‌ర్ న‌వ‌ల `కొండ పొలం` ఆధారంగా ఓ సినిమాని ప్లాన్ చేశారు. వై. రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబా నిర్మాత‌లు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో  ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌త నెల‌లోనే షూటింగ్ ప్రారంభ‌మైంది. తాజాగా ర‌కుల్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. వికారాబాద్ అడ‌వుల్లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టారు.

కాగా  ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క టెక్నీషియ‌న్‌కు క‌రోనా సోకింద‌ని, ఆ విష‌యం తెలిసి ద‌ర్శ‌కుడు క్రిష్ షూటింగ్ ఆపేసి, టీమ్ అంద‌రిని హోమ్‌ క్వారెంటైన్‌కి వెళ్లాల‌ని, వైర‌స్ త‌గ్గిన త‌రువాతే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామ‌ని చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, కావాల‌నే ఈ రూమ‌ర్‌ని పుట్టించార‌ని తెలిసింది.