రకుల్ ప్రీత్.. క్రిష్ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందా?

రకుల్ ప్రీత్.. క్రిష్ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందా?
రకుల్ ప్రీత్.. క్రిష్ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందా?

మహేష్ బాబుతో స్పైడర్ చిత్రంలో నటించాక టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ డౌన్ ఫాల్ మొదలైంది. గతేడాది మన్మథుడు 2 ప్లాప్ తో రకుల్ పూర్తిగా కనుమరుగైంది. అయితే చేతిలో అవకాశాలు లేని సమయంలో ఇప్పుడు రకుల్ హైదరాబాద్ లో మకాం వేసింది. దర్శకులను, నిర్మాతలను సినిమా కోసం కలుస్తోంది రకుల్. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన సినిమా మాత్రమే చేస్తోంది. చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చెక్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.

ఈ సినిమా కాకుండా రకుల్ ప్రీత్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. క్రిష్ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ ను రూపొందించే పనిలో ఉన్నాడు. తానే స్క్రిప్ట్ రాసి నిర్మించనున్న ఒక వెబ్ సిరీస్ కు రకుల్ అయితే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నాడు. అది ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వీలైనంత తొందర్లో ఈ సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అల్లు అరవింద్ ఓటిటి సంస్థ ఆహా కోసం క్రిష్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.