ర‌కుల్ కోసం క్రిష్ షెడ్యూల్ మారుస్తున్నారా?


ర‌కుల్ కోసం క్రిష్ షెడ్యూల్ మారుస్తున్నారా?
ర‌కుల్ కోసం క్రిష్ షెడ్యూల్ మారుస్తున్నారా?

సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రం `ఉప్పెన‌` రిలీజ్ కాకుండానే మ‌రో మూవీని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `కొండ పొలం` అనే న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని కొత్త పంథాలో తెర‌కెక్కిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి సాయిబాబా, వై. రాజీవ్రెడ్డి ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. వికారాబాద్ అడ‌వుల్లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన లొకేష‌న్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఇందులో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌ల్లెటూరి యువ‌తిగా ఆమె పాత్ర చాలా విభిన్నంగా వుండ‌బోతోంది. అయితే ర‌కుల్ కారణంగా ఈ మూవీ షెడ్యూల్‌ని మార్చిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల రియా కార‌ణంగా డ్ర‌గ్ ఆరోప‌ణ‌ల్లో స‌మ‌న్లు ఎదుర్కొన్న ర‌కుల్ విచార‌ణ కోసం ముంబై వెళ్లిన విష‌యం తెలిసిందే.

ఆమె మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావ‌చ్చ‌నే అనుమానంతో ఈ చిత్ర షెడ్యూల్‌ని మార్చిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం. ముంబై నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన ర‌కుల్ తో కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేయాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.