అఖిల్ తో క్రిష్ సినిమా చేయడం లేదట

Krish not intrested with akhil అక్కినేని అఖిల్ తో క్రిష్ ఓ సినిమా  చేయనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పట్లో అఖిల్ తో క్రిష్ సినిమా చేయడం కష్టమే అని అంటున్నారు . ఎందుకంటే క్రిష్ ఇప్పుడు తన ద్రుష్టి అంతా ఎన్టీఆర్ మహానాయకుడు మీద పెట్టాడు . మణికర్ణిక తో ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన  ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి రిపేర్లు చేస్తున్నారు క్రిష్.

అది పూర్తయి సినిమా రిలీజ్ అయ్యాక దాని ఫలితం ఎలా ఉంటుందో చూసి అప్పుడు తదుపరి ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకోనున్నాడట క్రిష్ . ఈలోపు మరో సినిమా గురించి ఆలోచించేంత సమయం కూడా లేదని అంటున్నారు క్రిష్ సన్నిహితులు . ఇక అఖిల్ ఇప్పటివరకు హీరోగా నటించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో నాగార్జున తెగ బాధపడుతున్నాడట అఖిల్ కంటే.

English Title: Krish not intrested with akhil