ఒకే సినిమాకు ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌లు‌!


ఒకే సినిమాకు ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌లు‌!
ఒకే సినిమాకు ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌లు‌!

ఒకే సినిమాకు ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌లు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, మ‌రొక‌రు స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి. `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి చారిత్ర‌క చిత్రం త‌రువాత సురేంద‌ర్‌రెడ్డి ఓ స్టార్ హీరో కోసం ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ నిర్మించ‌నున్న‌ట్టు తెలిసింది.

లాక్‌డౌన్ కార‌ణంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ తెర‌కెక్కించ‌నున్న సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోవ‌డంతో ఆ స‌మ‌యంలో ఖాలీగా వున్న క్రిష్ కొంత మంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లు విన్నార‌ట‌. అందులో సురేంద‌ర్‌రెడ్డి వినిపించిన స్క్రిప్ట్ అమితంగా ఆక‌ట్టుకుంద‌ట‌. దీంతో ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తాన‌ని క్రిష్.. సురేంద‌ర్‌రెడ్డికి మాటిచ్చార‌ట‌.

అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం జ‌రుపుకోనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో న‌టించ‌నున్నార‌ని తెలిసింది. అది ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది. క్రిష్ ఇటీవ‌ల `మ‌స్తీస్‌` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించిన విష‌యం తెలిసిందే.