కంగనా రనౌత్ సినిమా విషయంలో క్రిష్ ఫుల్ క్లారిటీ ఇదిగో!

కంగనా రనౌత్ సినిమా విషయంలో క్రిష్ ఫుల్ క్లారిటీ ఇదిగో!
కంగనా రనౌత్ సినిమా విషయంలో క్రిష్ ఫుల్ క్లారిటీ ఇదిగో!

ఎవరైనా టాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్ లో సినిమా తీస్తున్నాడంటే అందరూ సంతోషిస్తారు. అలాగే దర్శకుడు క్రిష్ మణికర్ణిక వంటి హిస్టారికల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడని అందరూ సంతోషించారు. సినిమా షూటింగ్ కూడా సజావుగా సాగిపోయింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ క్రిష్ పేరును తీసేసి కంగనా కొన్ని సీన్లను డైరెక్ట్ చేసుకుని దర్శకురాలిగా కూడా తన పేరునే వేసుకుంది.

ఈ వివాదంపై అప్పట్లోనే క్రిష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అయితే రీసెంట్ గా సామ్ జామ్ ఇంటర్వ్యూకు వచ్చాడు క్రిష్. అందులో ఈ వివాదంపై స్పందించాడు. ఆఖరు సారి ఈ వివాదంపై మళ్లాడుతున్నానని, మరోసారి ఈ విషయంపై స్పందించనని చెబుతూ, “91 రోజుల పాటు మేము మణికర్ణిక షూటింగ్ ను చాలా సంతోషంగా చిత్రీకరించాము.

సినిమా అవుట్ఫుట్ ను చూసి కంగనా అండ్ టీమ్ కూడా చాలా హ్యాపీగా స్పందించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు కంగనా టీమ్ నుండి ఫోన్ వచ్చింది. సెకండ్ హాఫ్ విషయంలో కొంత సంతృప్తిగా లేరని చెప్పారు. అలాగే సోను సూద్ పాత్రను కూడా తగ్గించమని అన్నారు. దీనికి నేను అంగీకరించలేదు. నా ప్రమేయం లేకుండా వాళ్ళే షూట్ చేసుకుని రిలీజ్ చేసుకున్నారు” అని క్రిష్ స్పందించాడు.