క్రిష్, వైష్ణవ్ సినిమా… ఇబ్బంది ఎక్కడొచ్చింది?

క్రిష్, వైష్ణవ్ సినిమా... ఇబ్బంది ఎక్కడొచ్చింది?
క్రిష్, వైష్ణవ్ సినిమా… ఇబ్బంది ఎక్కడొచ్చింది?

ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు వైష్ణవ్ తేజ్. తన తొలి చిత్రంతోనే 40 కోట్ల మార్క్ ను అందుకుని రికార్డు సృష్టించాడు. ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో వరసగా మూవీ ఆఫర్స్ వైష్ణవ్ ను చుట్టుముట్టాయి. అయితే ఉప్పనే విడుదల కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఉప్పెన రిలీజ్ కంటే ముందే పూర్తయింది.

ఉప్పెన సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా త్వరగా విడుదల చేస్తే క్యాష్ చేసుకోవచ్చన్న ఆలోచన వచ్చింది. అయితే ఎందుకని క్రిష్ ఈ విషయంలో తొందరపడట్లేదు, ఎందుకని చిత్ర విడుదలను జాప్యం చేస్తున్నాడు అన్నది ఎవరికీ అర్ధం కాలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే క్రిష్ చిత్ర షూటింగ్ ను మాత్రమే పూర్తి చేసాడు. చిత్రం ఇంకా విడుదలకు రెడీ అవ్వలేదు.

నిజానికి ఈ చిత్రం అడవి నేపథ్యంలో ఉంటుంది. ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంది. వివిధ కంపెనీలకు ఈ చిత్ర విఎఫెక్స్ పనులను అప్పగించాడట. కరోనా కారణంగా ఈ సినిమా విఎఫెక్స్ పనులు అనుకున్నంత వేగంగా పూర్తవ్వట్లేదు. డిసెంబర్ కు చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని అంటున్నారు. థియేటర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నాడు.