ప్రభాస్ 20 గురించి రెండు సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు


ప్రభాస్ 20 గురించి రెండు సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు
ప్రభాస్ 20 గురించి రెండు సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే తన 20వ చిత్రం షూటింగ్ తిరిగి మొదలైన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ సాహో టైమ్ లోనే మొదలైంది. అప్పుడు యూరోప్ లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక సాహో కోసం షూటింగ్ ను హోల్డ్ లో పెట్టారు. అయితే సాహో చిత్ర పరాజయం తర్వాత ప్రభాస్ 20వ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. స్క్రిప్ట్ పరంగానే కాకుండా బడ్జెట్ ను కంట్రోల్ చేసే విధానాలు కూడా చర్చించి దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. యూరోప్ వెళ్లకుండా ఇక్కడే హైదరాబాద్ లో భారీ సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ తో పాటు గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణం రాజు కూడా నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెల్సిందే. ఇటీవలే మీడియాతో ముచ్చటిస్తూ కృష్ణం రాజు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. ప్రభాస్ 20వ చిత్రం ఈ ఏడాది దసరా లేదా దీపావళి టైమ్ కు వస్తుందని అంతా ఆశించారు. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రభాస్ 20 వచ్చేది సమ్మర్ 2021లోనే అని కృష్ణం రాజు తెలిప.

ఇది ప్రభాస్ అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగించే వార్తే. ఈ బ్యాడ్ న్యూస్ తో పాటు మరో గుడ్ న్యూస్ ను కూడా చెప్పారు కృష్ణం రాజు. ఈ చిత్రంలో తాను కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయాన్ని రివీల్ చేసాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే. జిల్ గేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 1960ల కాలంలో జరిగే పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.