ఆ ప్ర‌శ్న న‌న్ను టార్చ‌ర్ పెట్టింది!


Krishnavamsi confirmed Shivathmika role in Rangamarthanda
Krishnavamsi confirmed Shivathmika role in Rangamarthanda

కెరీర్‌లో వాట్ నెక్ట్స్ అనే మాట విన‌ని వారుండ‌రు. చ‌దువు పూర్త‌యిన వారిని త‌రువాత ఏంటి? ఏం చేస్తావ్‌? ఎటు వెళ‌తావు? ఏ రంగాన్ని ఎంచుకుంటావ్‌? అని ఇలా వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో చంపేస్తుంటారు. నిజంగా ఇదొక టార్చ‌ర్‌. ఇక సినీ రంగంలో అయితే ఈ మాట త‌రచూ వినిపిస్తూనే వుంటుంది. ఒక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన హీరో ఇంత‌కు మించి చేయాలంటే వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తుంటారు. ఇక ఫ్లాప్ వ‌చ్చిన వాళ్లకు ఈ ప్ర‌శ్న మ‌రీ టార్చ‌ర్ పెట్టేస్తుంది.

అలాంటి టార్చ‌ర్‌నే త‌ను అనుభ‌వించాన‌ని హీరో డా. రాజ‌శేఖ‌ర్ ముద్దుల కూతురు శివాత్మిక సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. శివాత్మిక `దొర‌సాని` చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే సినిమా ద్వారా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `దొర‌సాని` ఆశించిన ఫ‌లితాన్ని అందింకపోగా తొలి సినిమా ఫ్లాప్ అన్న అప‌వాదుని తెచ్చిపెట్టింది.

దీంతో గ‌త కొన్ని నెల‌లుగా వాట్ నెక్స్ట్ అనే ప్ర‌శ్న వినీ వినీ బోర్‌కొట్టింద‌ని, ఈ ప్ర‌శ్న త‌న‌ని టార్చ‌ర్ పెట్టింద‌ని, ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కృష్ణ‌వంశీగారి నెక్స్ట సినిమా అని ట్వీట్ చేసింది శివాత్మిక‌. శివాత్మిక ఫొటోని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌రమైన ట్వీట్‌ని పోస్ట్ చేశారు. ` ఎంతో నైపుణ్యం, చురుకైన ఇద్ద‌రు లెజెండ‌రీ న‌టుల కుమార్తె శివాత్మిక `రంగ‌మార్తాండ‌`లో ల‌వ్లీ కుమార్తెగా న‌టిస్తున్నారు. చీర్స్‌` అని ట్వీట్ చేసి త‌న చిత్రంలో శివాత్మిక న‌టిస్తోంద‌ని క్లారిటీ ఇచ్చారు.