కృతి రేటు విని బెంబేలెత్తుతోన్న నిర్మాతలు

కృతి రేటు విని బెంబేలెత్తుతోన్న నిర్మాతలు
కృతి రేటు విని బెంబేలెత్తుతోన్న నిర్మాతలు

ఉప్పెన చిత్రంతో కృతి శెట్టి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ సినిమా సాధించిన ఘన విజయంలో కృతికి కూడా ప్రధాన పాత్ర ఉంది. అందుకే ఆమెకు ఉప్పెన విడుదల తర్వాత అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్, రామ్ నెక్స్ట్ సినిమాలో నటిస్తోన్న కృతి అప్పుడే కోటికి పైగా డిమాండ్ చేస్తోందని టాక్.

రీసెంట్ గా బంగార్రాజు నిర్మాతలు కృతి శెట్టిని తమ సినిమాలో పాత్రను ఆఫర్ చేస్తే కోటి రూపాయలు డిమాండ్ చేసింది. అందులో అదేమీ హీరోయిన్ పాత్ర కాదు. బంగార్రాజులో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. చైతన్యకు జోడిగా కృతిను అనుకుంటున్నారు. ఆమె కోటి అడుగుతోంది మరి.

ఈ రేటు విని నిర్మాతలు కంగారుపడ్డారు. మరి ఈ నేపథ్యంలో నిర్మాతలు ఏం డిసైడ్ అవుతారో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య లడఖ్ లో షూటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే.